రాష్ట్ర రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం నాడు.. కూడా భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 24 మందికి కొవిడ్ నిర్ధారణయింది. ఇందులో యూసుఫ్ గూడలో 11, ఎర్రగడ్డలో 6, రెహమత్ నగర్లో 4, బోరబండలో 2, వెంగళరావు నగర్లో 1, మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. మల్కాజిగిరిలోని జిల్లా ఆస్పత్రిలో 227మందికి పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్ వచ్చింది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20 మందికి పాజిటివ్‌గా తేలింది. కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. మూసాపేట్ సర్కిల్ పరిధిలో 28 కేసులు నమోదు కాగా, కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో 14 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో 189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. హైదరాబాద్ పాతబస్తి చంద్రాయణగుట్ట సర్కిల్లోని మైసారం, పార్వతి నగర్, బండ్లగుడ, ఉప్పుగూడ ప్రాంతాల్లో మొత్తం 220 మందికి కరోనా పరీక్షలు చేయగా 24 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
శ్వేతా మహంతికి నెగటివ్.. హైదరాబాద్‌లో తగ్గని కరోనా కేసులు - కరోనా వార్తలు
హైదరాబాద్‌లో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం కూడా నగరంలో భారీగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో రెండు రోజులుగా ప్రచారం కావడం వల్ల యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దుండిగల్ లో 154 మందికి పరీక్షలు చేయగా 43 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్‌లో 35 మందికి పరీక్షలు చేయగా 13 మందికి, షాపూర్ నగర్లో 60 మందికి పరీక్షలు చేయగా 12 మందికి, గాజులరామారంలో 55 మందికి పరీక్షలు చేయగా 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హసన్ నగర్ డివిజన్లో 66 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 30 మందికి, శివరాంపల్లి డివిజన్లో 66 కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 30 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇదీ చదవండి:సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు