తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో కరోనా విజృంభణ.. తాజాగా 391 కేసులు - corona cases increasing in greater hyderabad region

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 40,126 కేసులు నమోదయ్యాయి. తాజాగా 391 మందికి వైరస్ సోకగా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. అయితే కొందరిలో లక్షణాలున్నా యాంటిజన్‌లో నెగిటివ్‌ రిపోర్టు చూపుతోంది. ఇలాంటి వారు ఆర్టీసీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

corona cases increasing in greater hyderabad region
గ్రేటర్ హైదరాబాద్​లో తాజాగా 391 కరోనా కేసులు

By

Published : Aug 5, 2020, 7:56 AM IST

గ్రేటర్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 40,126. తాజాగా మరో 391 మందికి వైరస్‌ సోకింది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో 121 మంది, మేడ్చల్‌ జిల్లాలో 72 మంది కరోనా బారిన పడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 12 మంది మృత్యువాత పడ్డారు. పరీక్ష కేంద్రాల వద్ద నిత్యం చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో 30-50 మించి టెస్టులు చేయడం లేదు.

ప్రస్తుతం అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల వద్ద ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. 20 సంచార వాహనాల ద్వారా కూడా చేస్తున్నారు. అయితే కొందరిలో లక్షణాలున్నా యాంటిజన్‌లో నెగిటివ్‌ రిపోర్టు చూపుతోంది. ఇలాంటి వారు ఆర్టీసీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేసే సంఖ్య తక్కువున్నప్పటికీ వచ్చేవారు మాత్రం నాలుగు రెట్లు అధికంగా ఉంటున్నారు. ఫలితంగా వైరస్‌ ఉన్నవారి నుంచి లేనివారికి వ్యాపించే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

ABOUT THE AUTHOR

...view details