తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో తగ్గిన ప్రాంతాల్లోనే మళ్లీ కరోనా కేసులు - corona cases increasing in ghmc

జీహెచ్​ఎంసీ పరిధిలో గతంలో కరోనా వ్యాప్తి చెంది తగ్గిన ప్రాంతాల్లో మళ్లీ కొత్త కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అనుమానం వచ్చిన కొన్ని ప్రాంతాల్లో నమూనాలు సేకరించి వాటిని పరీక్షలకు పంపారు. వారందరినీ క్వారంటైన్​కు తరలించినా.. మళ్లీ అక్కడ కేసులు నమోదవుతున్నాయి.

corona-cases-increasing-in-ghmc
గ్రేటర్​లో తగ్గిన ప్రాంతాల్లోనే మళ్లీ కరోనా కేసులు

By

Published : May 21, 2020, 9:01 AM IST

గతంలో కరోనా వ్యాప్తి చెంది తగ్గిన ప్రాంతాల్లో మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆందోళన వ్యక్తమవుతోంది. లంగర్‌హౌస్‌, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొన్ని ప్రాంతాల నుంచి అనుమానితులు ఫీవర్‌ ఆసుపత్రిలో చేరారు. వీరి నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. ఆయా ప్రాంతాలను క్వారంటైన్‌ చేసి కేసులను అదుపులోకి తీసుకొచ్చారు. తాజాగా అక్కడ కూడా ఒకటి, రెండు కేసులు నమోదు కాగా యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా గ్రేటర్‌లో 15 మందిలో కరోనా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గాంధీలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మూసాపేటలోని ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. మరో వ్యక్తి వివరాలను వెల్లడించలేదు.

ఒకే ఇంట్లో 8 మందికి..

టప్పాచబుత్రలో ఒకే ఇంట్లో 8మందికి కరోనా పాజిటివ్‌ సోకింది. సదరు ఇంట్లోని వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. అతని నుంచి అతని తల్లిదండ్రులతోపాటు మొత్తం 8మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మోతీనగర్‌ పరిధిలోని అవంతినగర్‌ తోటకు చెందిన వ్యక్తి (60)కి ఈనెల 16న పాజిటివ్‌ రాగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. అతని కుమారుడు, అద్దెకుంటున్న వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. సుభాష్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌.ఆర్‌.నాయక్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

మెహిదీపట్నం: రాజేంద్రనగర్‌, బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహిళ(23), లంగర్‌హౌజ్‌ బాపూనగర్‌లో పుట్టింటికి వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

వెంగళ్‌రావునగర్‌: అల్లాపూర్‌ డివిజన్‌ రాణా ప్రతాప్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడం వల్ల గాంధీకి తరలించారు. 6 మందిని పరీక్షలు కోసం తరలించారు. యాఖుత్‌పురా ఎస్‌ఆర్‌టీ కాలనీకు చెందిన 53 ఏళ్ల మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికు తరలించారు.

ఆల్విన్‌కాలనీ: ఆల్విన్‌కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండ ప్రాంతంలో ఓ 80ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈయనకు క్యాన్సర్‌ ఉండటంతో తరుచూ కారుడ్రైవర్‌ సహాయంతో ఆసుపత్రికి వెళ్తున్నట్లు తెలిసింది. డ్రైవర్‌ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ABOUT THE AUTHOR

...view details