కరోనా వృద్ధులనే కాదు పిల్లలు, యువతను వణికిస్తోంది. రాష్ట్రంలో 11 నుంచి 20 ఏళ్లలోపు పిల్లలు, యువకులపై కరోనా పంజా విసురుతోంది. జులై నెలాఖరు వరకూ చిన్నారుల్లో కేసులు తక్కువగానే ఉన్నాయి. అప్పట్లో 21-50 ఏళ్లలోపు వారిలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ కేటగిరీలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 70 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లోనూ కేసులు తగ్గాయి. జులై నెలాఖరు నాటికి మొత్తం కరోనా బాధితుల్లో పదేళ్లలోపు చిన్నారులు 3.4 శాతం ఉంటే.. ప్రస్తుతం 4.23 శాతానికి పెరిగారు.
బాధితుల్లో 11-20 ఏళ్ల మధ్య వయస్కులు జులై నెలాఖరు నాటికి 5.3 శాతం ఉంటే ఆగస్టు 22 నాటికి 6.5 శాతం, ప్రస్తుతం 8.72 శాతానికి పెరిగారు. అంటే ఈ విభాగంలో పెరుగుదల దాదాపు 30 శాతంపైగా నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల్లో 20 ఏళ్లలోపు వారు 12.95 శాతం ఉన్నారు.
కారణాలివీ..
- గత రెండు నెలలుగా వ్యాపార కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు. బయట తిరగడం పెరిగింది. పిల్లలు ఆన్‌లైన్ తరగతులతో ఇంటికే పరిమితమైనప్పటికీ కుటుంబసభ్యుల ద్వారా పిల్లలకు సోకుతోంది. 11-20 ఏళ్ల మధ్య పిల్లల్లోనూ 13 ఏళ్లుపైబడిన వారిలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి. పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఈ సమయంలో వైరస్ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా కేసుల వివరాలివీ..