కరోనా వైరస్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 30మందికి ఈ మహమ్మారి సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 31మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు. కోలుకున్న వారి సంఖ్య 45కి చేరింది. 11మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 364కి చేరింది. వీరిలో అత్యధికులు ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులే అని సమాచారం.
25 జిల్లాల్లో విస్తరించిన కరోనా..
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 జిల్లాల్లో కరోనా విస్తరించి ఉండగా... హైదరాబాద్లో తగ్గుముఖం పట్టింది. నిజామాబాద్ జిల్లాలోనూ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నిజామాబాద్లో కేవలం 19 పాజిటివ్ కేసులో ఉండగా.. సోమవారానికి ఆ సంఖ్య 26కి చేరింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 23 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఒకరు డిశ్చార్జయ్యారు. జోగులాంబలో తాజాగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. మేడ్చల్లోనూ.. ఆదివారం 12మందికి కరోనా ఉండగా... సోమవారానికి ఆ సంఖ్య 15కి చేరింది. మరో ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.
పెరుగుతున్న కేసులు..