హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలు కిక్కిరిస్తున్నాయి. రంగానగర్‌లో ఉన్న బైబిల్ హౌస్ పట్టణ ఆరోగ్య కేంద్రం, దోమలగూడంలోని గగన్ మహల్ పట్టణ ఆరోగ్య కేంద్రం, కవాడిగూడ నెహ్రూనగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని ఆరోగ్య కేంద్రాల వద్దకు కరోనా అనుమానిత బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద కూర్చోడానికి కూర్చీలు కూడా లేవు.
ముషీరాబాద్‌లో విజృంభిస్తోన్న కరోనా.. బీ అలర్ట్ - CORONA cases increased
ముషీరాబాద్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద.. జనాలు క్యూ కడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ముషీరాబాద్‌లో విజృంభిస్తోన్న కరోనా
ముషీరాబాద్ పీహెచ్సీలో 20, భోలక్‌పూర్‌లో 20, కవాడిగూడలో 9, దోమలగూడలో 12, గగన్‌మహల్‌లో 12, రంగానగర్‌లో 05 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం ఆయా కేంద్రాల్లో 260 కరోనా పరీక్షలు నిర్వహించారు.
- ఇదీ చూడండి:కొవిడ్ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్