ముషీరాబాద్ నియోజకవర్గంలో శనివారం ఒక్కరోజే 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలోని రాంనగర్, ముషీరాబాద్, గాంధీ నగర్, అడిక్‌మెట్, కవాడిగూడ, భోలక్‌పూర్ డివిజన్లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటివరకు 1345 మంది కొవిడ్ బారిన పడ్డారు. వ్యాధి తీవ్రమై 39 మంది మృతి చెందగా, 510 మంది కోలుకున్నారు.
ఒక్కరోజే 68 కేసులు.. ముషీరాబాద్‌లో కరోనా తాండవం!
ముషీరాబాద్ నియోజకవర్గంలో శనివారం ఒక్కరోజే 68 పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1345 మంది వైరస్ బారిన పడ్డారు.
ముషీరాబాద్‌లో కరోనా కలకలం!
ప్రస్తుతం 756 మంది నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. శనివారం కొత్తగా 68 మందికి కరోనా రాగా.. 29 మంది డిశ్చార్జ్ అయ్యా రని అధికారులు చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్