రాష్ట్రంలో కొత్తగా 241 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,63,026కు చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,902కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మరో 298 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,901 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 241 కరోనా కేసులు, ఇద్దరు మృతి - telangana varthalu
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 241 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. మరో 298 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 241 కరోనా కేసులు, ఇద్దరు మృతి
ప్రస్తుతం రాష్ట్రంలో 5,223 క్రియాశీల కేసులున్నాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు హోం ఐసోలేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ 52,943 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: Balakrishna: 'అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే మా లక్ష్యం'