CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 296 కరోనా కేసులు, ఒకరు మృతి - telangana varthalu
18:54 September 11
రాష్ట్రంలో కొత్తగా 296 కరోనా కేసులు, ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 296 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,61,302కి చేరింది. వైరస్‌తో తాజాగా ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,893కు పెరిగింది. కొవిడ్ నుంచి మరో 322 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 6,52,085కు చేరింది.
తెలంగాణలో ప్రస్తుతం 5,324 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వారిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ 69,833 మందికి కరోనా పరీక్షలు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 74 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: Jyotiraditya Scindia : డ్రోన్ టెక్నాలజీ చరిత్రలోనే ఓ సంచలనం: కేంద్ర మంత్రి సింధియా