తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,472 నమూనాలను పరీక్షించగా.. 591 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,997కు పెరిగింది. తాజాగా కరోనా మహమ్మారితో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,807కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 591 కరోనా కేసులు, 3 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 591 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 8,819 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
corona cases
రాష్ట్రంలో ప్రస్తుతం 8,819 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు 98.04 శాతం కాగా.. మరణాల రేటు 0.58గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
ఇదీ చూడండి:'అక్టోబర్‌లో తీవ్రస్థాయికి కరోనా థర్డ్‌వేవ్'
Last Updated : Aug 2, 2021, 9:16 PM IST