రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 83,763 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 455 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,45,406కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,805కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 648 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,32,728కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.