Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,707 కరోనా కేసులు, 16 మరణాలు - తెలంగాణ కొవిడ్ అప్డేట్స్
19:15 June 11
రాష్ట్రంలో కొత్తగా 1,707 కరోనా కేసులు, 16 మరణాలు
రాష్ట్రంలో కరోనా (Corona) తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రికవరీ రేటు 95.63 శాతానికి చేరింది. కొత్తగా లక్షా 24వేల 66 పరీక్షలు నిర్వహించగా... 1,707 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ (Covid) కేసులు.. 6లక్షల 318 కు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
వైరస్ కారణంగా మరో 16 మంది ప్రాణాలు కోల్పోగా... మొత్తం మృతుల సంఖ్య 3వేల 456కు చేరింది. వ్యాధి నుంచి కొత్తగా 2వేల 493 మంది కోలుకోగా... ఇప్పటివరకూ 5లక్షల 74వేల 103 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22 వేల 759 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 158, నల్గొండ 147, ఖమ్మం జిల్లాలో 124 మందికి కరోనా (Corona) పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చూడండి:covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్