తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Corona Cases: కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి.. తాజాగా 2,646 కేసులు - covid latest news

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ కాస్త శాంతించింది. నిన్న, మొన్నటి వరకు భారీగా నమోదైన కేసులు బుధవారం కాస్త తగ్గాయి. రాష్ట్రంలో తాజాగా 2,646 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Telangana Corona Cases: కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి.. తాజాగా 2,646 కేసులు
Telangana Corona Cases: కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి.. తాజాగా 2,646 కేసులు

By

Published : Feb 2, 2022, 8:30 PM IST

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొవిడ్​ కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 88,206 మందికి పరీక్షలు చేయగా.. తాజాగా 2,646 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 3,603 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 3.23 కోట్లకు పైగా పరీక్షలు చేయగా.. 7.69 లక్షల మందికి పైగా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 4,094 మంది మృతిచెందగా.. 7.30లక్షల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్‌కేసులు ఉన్నాయి.

తాజాగా నమోదైన కొవిడ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 747 పాజిటివ్‌కేసులు రాగా.. ఆ తర్వాత మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో 177, రంగారెడ్డి జిల్లాలో 134, హనుమకొండ 114, కరీంనగర్‌ 102 చొప్పున కేసులు వెలుగుచూశాయి.

ABOUT THE AUTHOR

...view details