రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,795 కరోనా కేసులు నమోదవగా... 8 మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు బాధితుల సంఖ్య 1,14,483కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 780 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కొత్తగా 2,795 కరోనా కేసులు, 8 మరణాలు - covid deathes in telangana
08:34 August 27
రాష్ట్రంలో కొత్తగా 2,795 కరోనా కేసులు, 8 మరణాలు
కొవిడ్ నుంచి 85,223 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,685 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 475 కరోనా కేసులు నమోదు కాగా... జిల్లాల్లో వైరస్ పంజా విసురుతోంది.
రంగారెడ్డి జిల్లాలో 268, నల్గొండ జిల్లాలో 164, ఖమ్మం జిల్లాలో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 136, వరంగల్ అర్బన్ జిల్లాలో 132 మంది కొవిడ్ బారిన పడ్డారు. సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 113 చొప్పున కరోనా కేసులు కాగా... నిజామాబాద్ జిల్లాలో 112, మంచిర్యాల జిల్లాలో 106కి వైరస్ సోకింది.
మహబూబాబాద్ జిల్లాలో 102 కరోనా కేసులు నమోదు కాగా... జగిత్యాల జిల్లాలో 89, సూర్యాపేట జిల్లాలో 86 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 77, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 72 మంది వైరస్‌బారిన పడగా... వనపర్తి, కామారెడ్డి జిల్లాల్లో 55, మహబూబ్‌నగర్ జిల్లాలో 45, జనగామ జిల్లాలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి.