తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 650కి చేరిన కేసులు - Covid-19 latest news
20:41 April 15
తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 650కి చేరిన కేసులు
తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇవాళ కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 650కి చేరింది. 514 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న 8 మందిని ఇవాళ డిశ్చార్జి చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 118 కోలుకున్నట్టు ప్రకటించింది.