హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో నేటికీ రెండు వేల కరోనా కేసులు నమోదయ్యాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ముషీరాబాద్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు - corona effect
నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో నేటికి రెండు వేల కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు కొత్తగా మరో 20 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు తెలిపారు.
corona cases in musheerabad constituency
ముషీరాబాద్, బోలక్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 66 మందికి పరీక్షలు నిర్వహించగా... 9 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దోమల్‌గూడాలోని గగన్‌మహల్ పీహెచ్సీలో 31 మందికి పరీక్షలు చేయగా 8 మందికి కరోనా సోకింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గోశాల సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి నిర్ధారణ అయింది.
ప్రస్తుతం 706 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 1246 మంది కోలుకున్నారు. కాగా... 47 మంది మృతి చెందారు.