హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బోలక్పూర్, రామ్నగర్, ముషీరాబాద్, గాంధీనగర్, కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్లలో ఇప్పటి వరకు 1544 మంది కరోనా వైరస్ బారిన పడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా కవాడిగూడ, గాంధీనగర్, రాంనగర్, బోలక్పూర్ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ముషీరాబాద్ నియోజకవర్గంపై కరోనా పంజా... 1500కు చేరిన కేసులు - corona case in telangana
నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 1500 కేసులు నమోదు కాగా... ఆయా డివిజన్లలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నియోజకవర్గంలో అత్యధిక కేసులు నమోదవుతున్న వేళ... అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
corona cases in musheerabad constituency
కొవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరగటం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజులుగా నియోజకవర్గంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయట్లేదని స్థానికులు ఆరోపించారు. కరోనా నివారణ విషయంలో ప్రభుత్వ అధికారులు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.