ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు.. - ap corona cases
13:08 June 18
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా విజృభిస్తుంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో అత్యధికంగా 425 మందికి కరోనా సోకింది. దీనితో 7,496కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది.
కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతిచెందారు. మెుత్తం మరణాల సంఖ్య 92కు చేరింది. ఇప్పటి వరకు 3,772 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 3,632 మందికి ఆస్పత్రల్లో చికిత్స అందిస్తున్నారు.