ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 264 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన 193 మందికి కరోనా పాజిటివ్ రాగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 44 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన మరో 27 మందికి కరోనా సోకింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మృతి చెందగా... మృతుల సంఖ్య 86కు చేరింది.
ఏపీలో మరో 264 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ఏపీ కరోనా వార్తలు
ఏపీలో కొత్తగా 264 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనాతో మృతి చెందగా... మృతుల సంఖ్య 86కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 6,456కు చేరింది.
ఏపీలో మరో 264 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఇప్పటివరకు ఏపీకి చెందిన 5,087 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,159 మందికి కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. విదేశాల నుంచి వచ్చిన వారు 210 మందికి సోకగా... ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 6,456కు చేరాయి. ప్రస్తుతం 2,985 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 15,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
- ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు