ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 59,198 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,063మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,95,669కు చేరింది. మరోవైపు 1,929మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,65,657 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
AP corona cases: ఏపీలో కొత్తగా వెయ్యికు పైగా కరోనా కేసులు - ap news
ఏపీలో కొత్తగా 1,063 కొవిడ్ కేసులు నమోదవగా.. ఈ మహమ్మారి కారణంగా 11మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించగా.. అనంతపురంలో ఒకరు మృతి చెందారు.
ఏపీలో కొత్తగా వెయ్యికు పైగా కరోనా కేసులు
తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున కన్నుమూశారు. అనంతపురంలో ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 13,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,341 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చూడండి:COUPLE SUICIDE: కరోనా వేళ.. అప్పుల బాధ భరించలేక..