గడిచిన 24 గంటల్లో ఏపీలో 72,731 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... 2,100 కరోనా కేసులు (corona cases) నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో 26 మంది మృతి చెందగా... ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 12,870కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,435మంది కోలుకోగా... ప్రస్తుతం 33,964 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
ఏపీలో కొత్తగా 2,100 కరోనా కేసులు, 26 మరణాలు జిల్లాల వారీగా మరణాలు- కేసులు
కొవిడ్ కారణంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 583 మందికి కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో 316, పశ్చిమగోదావరి జిల్లాలో 217, ప్రకాశం జిల్లాలో 176 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి:'ఆగస్టు నుంచే కరోనా మూడో దశ వ్యాప్తి'