ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 25,907 నమూనాలను పరీక్షించగా తాజాగా 74 కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,90,766కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఏపీలో కొత్తగా 74 కరోనా కేసులు - COVID CASES
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,90,766కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో కొత్తగా 74 కరోనా కేసులు
దీంతో ఇప్పటివరకు కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7176కి చేరింది. 24 గంటల్లో 61 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1009 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,62,086 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇవీ చదవండి:రాష్ట్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు: సీఎం