తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో నిదానంగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు ఉద్ధృతంగా నమోదైన పాజిటివ్​ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 5,487 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. ఈరోజు నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,12,300కు చేరింది. ప్రస్తుతం 63,116 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Corona Cases Discreased Slowly in Andhra Pradesh
ఏపీలో నిదానంగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

By

Published : Sep 28, 2020, 9:18 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,487 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ రోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,161 కు చేరింది. వైరస్ కారణంగా మరో 37 మంది మరణించగా... మృతుల సంఖ్య 5,745కి ఎగబాకింది. కరోనా నుంచి ఇప్పటివరకు 6,12,300మంది కోలుకున్నారు. ప్రస్తుతం 63,116మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,010 మంది కరోనా బారిన పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో 903, ప్రకాశంలో 634, చిత్తూరులో 329 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. గుంటూరులో 538, నెల్లూరులో 489, శ్రీకాకుళంలో 286 కరోనా కేసులు వెలుగు చూశాయి. అనంతపురంలో 310, కడపలో 271, విజయనగరంలో 362, కృష్ణాలో 97, విశాఖలో 145, కర్నూలులో 113 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కరోనా మృతులు...

ప్రకాశం జిల్లాలో సోమవారం నాడు ఏడుగురు మరణించగా... చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో నలుగురు చొప్పున, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు. అనంతపురం, విశాఖలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోగా... నెల్లూరు జిల్లాలో ఒకరు కన్నుమూశారు.

ఇదీ చదవండి:

ఇది ఉంటే కరెంటక్కర్లేదు.. పొలాల్లో నీరు గలగలా పారుతుంది!

ABOUT THE AUTHOR

...view details