తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి బుధవారం 129 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,680 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 292 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించడంతో కొన్ని పాఠశాలల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారు. హైదరాబాద్ గన్‌పౌండ్రీలోని మహబుబియా పాఠశాలలో విద్యార్థులు మాస్క్‌లు ధరించి తరగతులకు హాజరయ్యారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో మరోసారి కరోనా విజృంభణ.. ఒక్కరోజే.. - Corona cases
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారి నుంచి ఇవాళ 129 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,680కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
Telangana corona cases updates
దేశంలో ఇవాళ కొత్తగా 12,200లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 13 మరణాలు సంభవించాయి. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి మరికొందరు ప్రముఖులు కొవిడ్ బారిన పడటంతో మరోసారి కలవరం మొదలైంది.
ఇవీ చూడండి: