Corona cases: రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 516 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 434 మంది బాధితులు కోలుకున్నారు.
Corona cases: డేంజర్ బెల్స్.. 516 కరోనా కేసులు నమోదు - ts corona
రాష్ట్రంలో 500 దాటిన కరోనా కేసులు
19:48 July 02
Corona cases: రాష్ట్రంలో కొత్తగా 516 కరోనా కేసులు నమోదు
ఇవాళ నమోదైన కేసులతో కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం 4,784 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 26,976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఒక్క హైదరాబాద్ పరిధిలోనే కొత్తగా 261 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
ఇవీ చదవండి:కేసీఆర్ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నారు: బండి సంజయ్
Last Updated : Jul 2, 2022, 8:41 PM IST