తెలంగాణలో మరో 99 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,96,673 మందికి మహమ్మారి సోకింది.
తెలంగాణలో మరో 99 కరోనా కేసులు, 2 మరణాలు - తెలంగాణ వార్తలు
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 99 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి మరో ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో మరో 99 కరోనా కేసులు, 2 మరణాలు
వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,618 మంది మరణించారు. మరో 169 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,93,379కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 1,676 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 705 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 24 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి