ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువవుతోంది. శనివారం ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 81 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా గుర్తించిన బాధితుల్లో కృష్ణా జిల్లాలో 52 మంది, పశ్చిమ గోదావరిలో 12 మంది ఉన్నారు. మరో ఆరు జిల్లాల్లో 17 మంది వైరస్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,097కి చేరింది. 24 గంటల్లో 6,768 నమూనాలు పరీక్షించారు.
అయ్యో... కృష్ణా!... ఒక్క రోజే 52 కేసులు - అయ్యో... కృష్ణా!... ఒక్క రోజే 52 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో మొన్న కర్నూలు.. నిన్న చిత్తూరు.. నేడు కృష్ణా కరోనా కేసుల ఉద్ధృతితో అల్లాడుతున్నాయి. పదుల సంఖ్యలో కేసుల నమోదుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదుకావడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు రాష్ట్రంలో గత వారం రోజులుగా కేసుల తీవ్రత పెరుగుతోంది.
అయ్యో... కృష్ణా!... ఒక్క రోజే 52 కేసులు
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో.. 60 మందికి నెగెటివ్‌గా తేలటం వల్ల ఇళ్లకు పంపారు. ప్రస్తుతం 835 మందికి చికిత్స అందిస్తున్నారు. కరోనాతో గత 24 గంటల్లో మరణాలు సంభవించలేదని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 31గానే ఉంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ వారంలోనే మూడోవంతుకు పైగా కేసులు నమోదయ్యాయి.