హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అసిఫ్ నగర్ డివిజన్లో 49, భవాని నగర్లో 39, రీన్ బజార్లో 23, కాలాపత్తర్‌లో 20, గోల్కొండ డివిజన్లో19 కేసులు ఉన్నాయి.
భాగ్యనగరంపై కరోనా పంజా - హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 344 మంది చికిత్స పొందుతున్నారు. 57మంది వైరస్ నుంచి కొలుకున్నారు. 21మంది మృతి చెందారు.
భాగ్యనగరంపై కరోనా పంజా
అయితే మహంకాళి డివిజన్లో ఇప్పటికీ ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదవ్వలేదని సీపీ వివరించారు.