ఉప్పల్‌లో 'హెచ్' ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కె పరుగు నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. జెండా ఊపి 10కె రన్‌ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కరోనాపై అవగాహన కలిగి ఉండాలని... కనీస జాగ్రత్తలు పాటించాలని మహేశ్ సూచించారు. ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని... అయినా సరే జాగ్రత్తలు తప్పని సరి తీసుకోవాలని పేర్కొన్నారు.
కరోనాపై అవగాహన కల్పిస్తూ ఉప్పల్‌లో 10కె రన్ - hyderabad news
కరోనాపై అవగాహన కోసం 'హెచ్' ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్‌లో 10కె రన్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని... రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు.
కరోనాపై అవగాహన కల్పిస్తూ ఉప్పల్‌లో 10కె రన్
Last Updated : Jan 3, 2021, 9:55 AM IST