కొవిడ్-19 పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రచయితలు, గాయకులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్‌కు కులం, మతం, ఆడా మగా తేడా లేదంటున్నాడు జానపద యువ గాయకుడు మానుకోట ప్రసాద్. కరోనా సోకిందంటే చావుతో పోరాడాల్సిందే అంటూ.. అంతదాకా వెళ్లొద్దంటే జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
కరోనాకు 'కులం, మతం, ఆడా మగా తేడా లేదు' - Corona Awareness poetry Manukota prasad
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు కవులు, కళాకారులు సహకరిస్తున్నారు. జానపద యువ గాయకుడు కరోనాపై కవితలు, పాటలు రాసి... జనాల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

Breaking News
గడియకొక్కసారి చేతులు కడుక్కుని... ఇంట్లోనే బందీగా ఉండాలని సూచిస్తున్నాడు. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సామాజిక సందేశాలతో పాటలు కట్టే మానుకోట...తనదైన మాటలతో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
కరోనాకు 'కులం, మతం, ఆడా మగా తేడా లేదు'
ఇవీ చూడండి:'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'