రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా బాధితుల్లో 20 ఏళ్లలోపు యువకులు 90,561 మంది ఉన్నారు. పదేళ్లలోపు వయసున్న 19,445 మంది పిల్లలకు కొవిడ్ సోకింది. వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వయసుల వారీగా కరోనా బాధితుల నివేదికను రూపొందించింది. మొత్తం నమోదైన కేసుల్లో 61.4 శాతం మంది పురుషులు కాగా.. 38.6 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 31-40 ఏళ్ల బాధితులు 21.8 శాతం మంది. అందులో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే.. 41-50 ఏళ్ల మధ్య వయస్కులు 17.5 శాతం, 51-60 ఏళ్ల వారు 14.4, 61-70 ఏళ్ల మధ్యవయసు వారు 7.7, 71-80 ఏళ్ల వారు 2.7, 81 ఏళ్లు.. ఆ పై వయసు ఉన్న వారు 0.7 శాతం మంది మహమ్మారి బారినపడినట్లు వైద్య శాఖ నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌తో మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నారు.
కొత్తగా 186 కొవిడ్ కేసులు