తెలంగాణ

telangana

ETV Bharat / state

హోంమంత్రి కార్యాలయంలో కరోనా.. ఐదుగురికి వైరస్​ - కరోనా తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ కార్యాలయంలోనూ కొవిడ్​ కలకలం నెలకొంది. బుధవారం మరో ఐదుగురు భద్రతా సిబ్బంది ఈ వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా మిగిలిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

corona-at-home-minister-mahamood-ali-office
హోంమంత్రి కార్యాలయంలో కరోనా.. ఐదుగురికి వైరస్​

By

Published : Jun 25, 2020, 7:01 AM IST

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ కార్యాలయంలో ఐదుగురు భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. కొద్ది రోజుల క్రితం ఓ హోంగార్డు, మరో భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ కాగా.. బుధవారం మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

తొలుత కొందరు సిబ్బందికి వైరస్​ రావడం వల్ల హోం మంత్రి భద్రతను పర్యవేక్షించే సుమారు 50 మందికి విడతల వారీగా పరీక్షలు చేయించారు. తొలివిడతలో పరీక్షలు నిర్వహించిన 15 మంది భద్రతా సిబ్బందికి సంబంధించిన ఫలితాలు బుధవారం వచ్చాయి. వారిలో ఐదుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫలితంగా మిగిలిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

ఇదీచూడండి: రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details