ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించాలనే ముఖ్య ఉద్దేశంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు మహంకాళి ఏసీపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని భర్తాన్ కాంపౌండ్‌లో పలు ఇళ్లలో కట్టడిముట్టడి చేపట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 పోలీసులు 208 ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.
మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో కట్టడి ముట్టడి - పోలీస్‌స్టేషన్
హైదరాబాద్ మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు కట్టడిముట్టడి నిర్వహించారు. సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కట్టడి ముట్టడి