హైదరాబాద్ అంబర్పేట గోల్నాకలోని శాంతినగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో 52 మంది పోలీసులు సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతకు, సమస్యల్లో ఉంటే పోలీసులు గుర్తొచ్చేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. శాంతినగర్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీసీపీ రమేష్ సూచించారు.
ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు - police
ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు చేపట్టామని ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ తెలిపారు. అంబర్పేట గోల్నాకలోని శాంతినగర్లో ఆయన ఆధ్వర్యంలో 52 మంది పోలీసులు సోదాలు చేపట్టారు.
![ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు corden-search-in-amberpet-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5345498-1087-5345498-1576104078796.jpg)
ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు