తెలంగాణ

telangana

ETV Bharat / state

viral video: పగలైనా రాత్రైనా వాటి నుంచి తప్పించుకోలేరు.. - తెలంగాణ తాజా వార్తలు

కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. అదే దిమాక్​ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.. ఓ చిత్రంలోని ఈ డైలాగ్ విజిల్స్​ వేయించింది. అదేవిధంగా.. పగటి వేళ ట్రాఫిక్​ను నియంత్రిస్తుంటాం.. రాత్రివేళ నిఘానేత్రాలతో పహారా కాస్తుంటాం అంటూ సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు పెట్టిన ఓ పోస్టింగ్​ సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తుంది. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.

cable bridge
cable bridge

By

Published : Jul 19, 2021, 6:01 PM IST

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు జరిమానాలు విధించడం మనం చూస్తుంటాం... పగటి వేళల్లో ఎక్కువగా ఉల్లంఘనలు జరుగుతుంటాయి. అయితే అర్ధరాత్రి వేళ ఎవరుంటారు.. రోడ్లన్నీ మనవే అనుకునేవారికి ఓ షాకింగ్​ వీడియో చెమటలు పట్టించింది. నిఘానేత్రంలో పహారా కాస్తున్న పోలీసుల హెచ్చరికతో దిమ్మతిరిగిపోయింది. వామ్మో ఇదేంట్రాబాబు.. నడిరోడ్డుపై ఫోటో తీసుకుంటుంటే ఎక్కడి నుంచి చూస్తున్నార్రాబాబు.. ఈ ఫోటోలు వద్దు.. ఏమీ వద్దంటూ ఆ వ్యక్తి వెళ్లిపోతున్న ఘటన నవ్వులు పూయిస్తుంది.

రాత్రి సమయాల్లో పోలీసులు అంతగా పట్టించుకోరులే అనుకుని వాహనదారులు దూసుకుపోతుంటారు. అలా చేస్తే మీకు చలాన్ పడినట్లే. భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో ఉన్న సీసీకెమెరాలు 24 గంటల పాటు మీ ప్రతి కదలికను రెప్పవేయకుండా గమనిస్తుంటాయని మరచిపోవద్దు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. మాదాపూర్​లో నిర్మించిన తీగల వంతెనపై వాహనాలు ఆపి ఫోటోలు దిగడం నిషేధం. రెండు రోజుల క్రితం ఓ ద్విచక్ర వాహనదారుడు వంతెనపై బండి ఆపి స్నేహితులతో కలిసి ఫోటోలు దిగేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్​కు అనుసంధానం చేసి ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు వంతెన పై వాహనాలు ఆపొద్దు.. అక్కడినుంచి వెళ్లిపోండని మైకులో హెచ్చరించారు.

ఇదీ చూడండి:Viral: చటుక్కున పరుగెత్తి ప్రాణాలు రక్షించుకొని!

ఉలిక్కిపడిన ఆ వాహనదారుడు వామ్మో ఈ ఫోటోలు వద్దు ఏమీ వద్దు.. చలానా వేయకండి వెళ్లిపోతున్నా అంటూ పరుగందుకున్నాడు. ఈ వీడియోను సైబరాబాద్​ ట్రాఫిక్ ​పోలీసులు సామాజికమాధ్యమాల్లో పోస్టు చేశారు. పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు. ఎలాంటి చలాన్​ విధించలేదు. ఇప్పుడీ వీడియో నవ్వులు పూయిస్తోంది.

viral video: పగలైనా రాత్రైనా వాటి నుంచి తప్పించుకోలేరు..

ఇదీ చూడండి:సెలూన్​లోకి అనుకోని అతిథి- గంటసేపు మేకప్​!

ABOUT THE AUTHOR

...view details