కాప్స్ వర్సెస్ కొవడ్ -19 పేరుతో హైదరాబాద్ సిటీ పోలీసులు రూపొందించిన లఘు చిత్రానికి సీపీ అంజనీ కుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కరోనా వైరస్‌ను మూడో ప్రపంచ యుద్ధంగా అభివర్ణించిన అంజనీ కుమార్... అందరూ ఐక్య మత్యంగా ఉండి కలిసికట్టుగా పోరాడాలని తెలిపారు. రోగితో కాకుండా.. కరోనా వైరస్‌తో పోరాడాలని సీపీ అన్నారు.
సిటీ పోలీస్ రూపొందించిన 'కాప్స్ వర్సెస్ కొవిడ్ -19' లఘు చిత్రం - cp anjani kumar give a voice over in cops vs covid short film
హైదరాబాద్ సిటీ పోలీసులు కరోనాపై లఘు చిత్రాన్నిరూపొందించారు. కాప్స్ వర్సెస్ కొవిడ్ -19 పేరుతో రూపొందించిన ఈ లఘు చిత్రంలో... లాక్‌డౌన్ సందర్బంగా పోలీసుల విధి నిర్వహణ ప్రతిబింబించేలా దృశ్యాలున్నాయి.
సిటీ పోలీస్ రూపొందించిన కాప్స్ వర్సెస్ కొవిడ్ -19 లఘు చిత్రం
లఘు చిత్రంలో లాక్‌డౌన్ సందర్బంగా పోలీసుల విధి నిర్వహణ ప్రతిబింబించేలా దృశ్యాలున్నాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, చెక్‌పోస్టు కేంద్రాల వద్ద వాహనాల తనిఖీలు, నియంత్రణ ప్రదేశాల్లో పోలీసుల విధి నిర్వహణ సమయంలో తీసిన దృశ్యాలను లఘు చిత్రంలో పొందుపరిచారు.
ఇదీ చూడండి:కరోనా ఉన్నా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే