ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శని వారాల్లో ఒకటి రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు( సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా) నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
కనిష్ఠ ఉష్ణోగ్రత: చలి చంపేస్తోంది.. తెలంగాణ వణుకుతోంది! - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల శీతల గాలులు వీస్తాయని చెప్పారు.
![కనిష్ఠ ఉష్ణోగ్రత: చలి చంపేస్తోంది.. తెలంగాణ వణుకుతోంది! cool weather in telangana state for friday and saturday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10005044-thumbnail-3x2-cool.jpg)
పెరుగుతోన్న చలి తీవ్రత.. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు..
ఉత్తర తెలంగాణ జిల్లాలో రాగల రెండు రోజుల పాటు ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల చలి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Last Updated : Dec 26, 2020, 6:29 AM IST