ఉత్తరకోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, షేర్‌జోన్ ఏర్పడిందని... ఈ రెండింటి ప్రభావంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. మరో నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో 7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.
నాలుగైదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు
గత పదిరోజులుగా ఉగ్రరూపం దాల్చిన భానుడు ఈ రోజు ఉదయం నుంచి కాస్త చల్లబడ్డాడు. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిశాయి. వాతావరణం చల్లబడడానికి ముఖ్యకారణం... షేర్‌జోన్, ఉపరితల ఆవర్తనమేనని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.
నాలుగైదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు