తెలంగాణ

telangana

ETV Bharat / state

'తండాలను పంచాయతీలుగా మార్చడం అభినందనీయం' - తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు నిర్మించడం గొప్ప విషయమని జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మెన్‌ నందకుమార్‌ సాయి పేర్కొన్నారు.

'తండాలను పంచాయతీలుగా మార్చడం అభినందనీయం'

By

Published : Aug 29, 2019, 6:01 PM IST

'తండాలను పంచాయతీలుగా మార్చడం అభినందనీయం'

పేద ప్రజల కోసం ప్రభుత్వం డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమని జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మెన్‌ నందకుమార్‌ సాయి ప్రశంసించారు. రాష్ట్ర పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన ఆయన నేడు హైదరాబాద్​లోని తాజ్‌ దక్కన్‌లో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఎస్టీల జీవన స్థితిగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం అభినందనీయమని కొనియాడారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే.జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details