ముషీరాబాద్ బోలక్పూర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేయడం లేదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై మండిపడ్డారు. నాలుగు రోజులుగా మొదటి, రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటికీ టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని.. వ్యాక్సిన్ మాత్రం ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏరోజు బుకింగ్ చేసుకున్నవారికి ఆరోజు మాత్రమే వ్యాక్సిన్ వేయాలని.. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రజలకు సిబ్బంది చెప్పడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. రెండు, మూడు రోజుల క్రితం బుక్ చేసుకున్న వారికి టీకా ఇవ్వవద్దని చెప్పారన్నారు.