ఇటీవల బెంగళూర్‌లో జరిగిన అల్లర్లకు సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పదమైన పోస్టులు పెట్టిన హైదరాబాద్‌కు చెందిన ఏడుగురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారం రోజుల క్రితం బెంగళూర్‌లో ఓ మతాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి కాస్తా ఉద్రిక్తతలకు దారి తీశాయి.
సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్.. అల్లర్లు - సోషల్ మీడియాలో పోస్టుకు బెంగళూర్‌లో జరిగిన అల్లర్లు
సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందో.. అంతే ప్రమాదం కూడా. సైబర్ నేరగాళ్లు వివాదాలు సృష్టించేందుకు, డబ్బులు దోచుకునేందుకు, సామాజిక మాధ్యమాలను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పలువురు ఓ వివాదాస్పదమైన పోస్టు పెట్టి బెంగళూర్‌లో మత అల్లర్లు సృష్టించారు. హైదరాబాద్‌కు చెందిన వారిని పోలీసులు పట్టుకున్నారు.
అది పక్క ప్రణాళిక ప్రకారం చేసినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే హైదరాబాద్‌లో పలువురు ఆ అల్లర్లకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని సోషల్ మీడియా మానిటరింగ్ వింగ్ వాటిని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపారు. దీంతో ఆయా పోస్టులను తొలగించారు. ఆ పోస్టులు పెట్టిన వారు ఏడుగురు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఆ ఘటనపై మరింత దర్యాప్తు జరుపుతున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి :'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'
TAGGED:
riots at bangalore