తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్​ కార్మికుల ఆందోళన' - Hyderabad

పెండింగ్​లో ఉన్న వేతనాలను చెల్లించాలని శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్​ ఆసుపత్రుల్లో ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

protest

By

Published : Jul 23, 2019, 12:43 PM IST

Updated : Jul 23, 2019, 3:19 PM IST

గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వనుందుకు నిరసనగా శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ విభాగాలకు చెందిన కాంట్రాక్​ కార్మికులు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్​ ఆస్పత్రులలో సమ్మెకు దిగారు. కొన్ని రోజుల క్రితం అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు జీతాల విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడం వల్ల ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ నేత నరసింహ తెలిపారు. వేతనాలు అందక కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రులను శుభ్రంగా ఉంచే శానిటేషన్ విభాగం కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.

' హైదరాబాద్​ ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్​ కార్మికుల ఆందోళన'
Last Updated : Jul 23, 2019, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details