తెలంగాణ

telangana

ETV Bharat / state

NURSES Protest: ప్రగతిభవన్​ వద్ద నర్సుల ఆందోళన.. అరెస్ట్​ - Contract nurses protest in hyderabad

విధుల్లోంచి తొలగించిన తమను మళ్లీ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న ఒప్పంద నర్సులు ఇవాళ మరోమారు నిరసనకు దిగారు. ప్రగతిభవన్​ వద్ద తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫలితంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ప్రగతిభవన్​ వద్ద నర్సుల ఆందోళన
ప్రగతిభవన్​ వద్ద నర్సుల ఆందోళన

By

Published : Jul 13, 2021, 5:11 PM IST

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ ఎదుట ఒప్పంద నర్సులు మరోసారి ఆందోళనకు దిగారు. విధుల్లో నుంచి తొలగించిన తమను మళ్లీ తీసుకోవాలని నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారిని ​స్టేషన్​కు తరలించారు.

ప్రగతిభవన్​ వద్ద నర్సుల ఆందోళన..

తాము ఆందోళన చేసేందుకు రాలేదని.. వినతి పత్రం సమర్పించేందుకు వచ్చామని చెప్పినా వినకుండా పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అటు నర్సులు ప్రగతిభవన్ ముట్టడిస్తున్నారనే సమాచారంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీస్​ సిబ్బందిని మోహరించారు.

ఇదీ చూడండి:NURSES Protest: ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన నర్సులు.. ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details