కాంట్రాక్ట్ అధ్యాపకుల మినిమం టైం స్కెల్ హర్షణీయమని.... ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లిస్తామని... సీఎం కేసీఆర్(CM KCR) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు మినిమం పే స్కేల్ కల్పిస్తూ.. ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులివ్వడం, కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఐదు వేల పైచిలుకు కాంట్రాక్టు అధ్యాపకులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.