తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ఒప్పంద సేద్యానికి చట్టరూపం దాల్చనుందా? - contract farming to get started in telangana

ఒప్పంద సేద్యం చేయడానికి అనుమతిస్తూ కేంద్రం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్​తో ఖరీఫ్​​ నుంచి ఇది అమల్లోకి తేవాలా వద్దా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ తెస్తుందా లేదా అనేది తేలలేదు. పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే తమ అభిప్రాయాన్ని తెలపనున్నట్లు తెలంగాణ మార్కెటింగ్ శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది.

contract farming to get started in telangana
రాష్ట్రంలో ఒప్పంద సేద్యానికి చట్టరూపం దాల్చనుందా?

By

Published : Jun 6, 2020, 12:06 PM IST

ఒప్పంద సేద్యం చేయడానికి అనుమతిస్తూ కేంద్రం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్​తో ఖరీఫ్​​ నుంచి ఇది అమల్లోకి తేవాలా వద్దా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్డినెన్స్​ అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారుు శుక్రవారం దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో అన్ని రాష్ట్రాల మార్కెటింగ్​ శాఖలకు సూచించారు. ఆర్డినెన్స్​ను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే తమ అభిప్రాయాన్ని తెలపనున్నట్లు తెలంగాణ మార్కెటింగ్ శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 400 వరకు కంపెనీలు...

ఆ ఉత్తర్వుల ప్రకారం రైతులతో ఒప్పందం చేసుకుని పంటలు పండించే కంపెనీలు తప్పనిసరిగా మార్కెటింగ్ శాఖ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో 400 వరకూ విత్తన కంపెనీలు రైతులతో పంటలు సాగుచేయిస్తున్నాయి. దేశానికి అవసరమైన పలు పంటల విత్తనాలను తెలంగాణలో పండిస్తున్నట్లు కంపెనీలు చెపుతున్నాయి. ఇవే కాకుండా హైదరాబాద్​లో విక్రయాల కోసం పలు పెద్ద కంపెనీలు చుట్టుపక్కల జిల్లాల రైతులతో ముందుగా ఒప్పందాలు చేసుకుని పండ్లు, కూరగాయలతోటలు సాగు చేయిస్తున్నాయి. ఇలా రైతులతో, కంపెనీలు పండించే పంటలన్నీ ఒప్పంద సేద్యం కిందకే వస్తాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

దళారుల పేరుతో ఒప్పందాలు చేస్తూ..

వాస్తవానికి ఒప్పంద సేద్యం చేయడానికి అనుమతిస్తూ గతంలో మార్కెటింగ్ ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఏ కంపెనీ కూడా మార్కెటింగ్ శాఖ వద్ద వివరాలను నమోదు చేయించడం లేదు. ఇలా నమోదు చేయిస్తే పంట పండిన తరువాత రైతుల పంటను కచ్చితంగా మార్కెట్ ధరకు కొని నిర్ణీత ధర చెల్లించాలి. ఇలా ఒప్పంద సేద్యం కిందకు రాకూడదని కంపెనీలు ముందు జాగ్రత్తగా దళారులను ఏర్పాటుచేసి వారితో రైతుల వద్ద ఒప్పందాలు చేయిస్తున్నాయి. కంపెనీ పేరు రాయకుండా దళారుల పేరుతో గ్రామాల్లో ఒప్పందాలు సాగుతున్నాయి. పంటకు ధర రాక రైతులు నష్టపోతే కంపెనీలు తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నాయి.

ఏం జరగనుందో?

ఈ నేపథ్యంలో ఒప్పంద సేద్యానికి చట్టరూపం ఇవ్వాలని కేంద్రం ఆర్డినెన్స్ జారీచేయడం గమనార్హం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ తెస్తుందా లేక గతంలో జారీచేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయడానికి చర్యలు తీసుకుంటుందా అనేది తేలలేదు. రైతులతో ఒప్పందాలు చేసుకుని పంటలు పండించే కంపెనీలు ముందుగా మార్కెటింగ్ శాఖ వద్ద నమోదు చేసుకోవాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారని తెలుస్తోందని, పూర్తిగా అధ్యయనం చేసిన తరవాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని మార్కెటింగ్ శాఖ సంచాలకురాలు లక్ష్మీభాయి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details