Contract JL Employees Letters to Government :తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదటిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా.. కాంట్రాక్టు ఉద్యోగులను(Contract Employees) రెగ్యులరైజ్ చేసేందుకు సీఎం కేసీఆర్ సర్కారు 26 ఫిబ్రవరి 2016న జీఓ నెంబర్ 16ను తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో 1,1600 మంది రెగ్యులరైజేషన్కు అసెంబ్లీ ఆమోదించింది.
CM KCR: కొత్త సచివాలయ ప్రారంభ వేళ.. ఒప్పంద ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు
కానీ, 30 ఏప్రిల్ 2023న తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా 5,500 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తూ జీఓ నెంబర్ 38ని విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ లో పనిచేస్తున్న 3,550 మందికిగాను 3,093(జనరల్, ఒకేషనల్ విభాగంలో కలిపి) మందిని మాత్రమే క్రమబద్ధీకరించడానికి అనుమతిచ్చింది. అయితే అన్ని రకాల విద్యా అర్హతలు కలిగి ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న 411 మంది కాంట్రాక్టు అధ్యాపకులను పోస్టులు లేవనే కారణంతో రెగ్యులరైజేషన్ లిస్టులో కలపకుండా వదిలివేశారని వారు వాపోతున్నారు.
Contract 411 Employees Letters to Government :వాస్తవానికి పోస్టులను అవసరానికి అనుగుణంగా కన్వర్షన్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. అధికారులు అలా చేయలేక, పోస్టులు లేవని సమాధానం చెబుతున్నారు. తమకు ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోవడం వలన సమాజంలో.. తోటి అధ్యాపకుల నుంచి ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంటూ మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని కాంట్రాక్ట్ ఒకేషనల్ అధ్యాపకులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.