తెలంగాణ

telangana

Thefts in Hyderabad : మారణాయుధాలతో బెదిరిస్తూ వరుస చోరీలు.. భయాందోళనలో భాగ్యనగరవాసులు

By

Published : May 13, 2023, 9:18 AM IST

Thefts in Hyderabad : హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో మారణాయుధాలతో బెదిరించి.. దోపిడీలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల సిటీ శివారు ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డున చోరీలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బంజారాహిల్స్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో రెండు దోపిడీ కేసులు నమోదయ్యాయి. వరుస ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురువుతున్నారు.

theft
theft

Thefts in Hyderabad : నిత్యం నిఘా నీడలో ఉంటున్న నగరంలో వరుస దోపిడీలు.. స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-52లోని ఓ వ్యాపారి ఇంట్లో సినీఫక్కీలో చోరీ జరిగింది. ముఖానికి మాస్క్‌ ధరించి.. తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. బాధిత కుటుంబాన్ని కత్తితో బెదిరించి రూ.10 లక్షలు దోచుకెళ్లాడు. ఎన్​ఎస్​ఎన్​ రాజు అనే వ్యాపారి, కుటుంబంతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లారు. విషయం గమనించిన అగంతుకుడు.. రెక్కీ నిర్వహించాడు. వ్యాపారి కుటుంబం తెల్లవారుజామున ఇంటికి చేరుకోగా.. అదే సమయంలో, సదరు దుండగుడు వెనక ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు.

డబ్బు మాత్రమే కావాలి..:గర్భిణీని కత్తితో బెదిరించగా.. ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ ఇస్తామని చెప్పింది. అందుకు నిరాకరించిన దుండగుడు.. తనకు కేవలం డబ్బు మాత్రమే కావాలన్నాడు. దాంతో బీరువాలో ఉన్న రూ.2 లక్షల నగదును గర్భిణీ దుండగుడికి ఇచ్చింది. అవి సరిపోవన్న అగంతుకుడు బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు తెప్పించాలని డిమాండ్‌ చేశాడు. దాంతో బాధిత కుటుంబ మరో రూ.8 లక్షలు తెప్పించి ఇచ్చారు. పోలీసులకు చెబితే.. కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని బెదిరించినట్టు వ్యాపారి తెలిపారు. దోపిడీ అనంతరం అగంతకుడు తమ మొబైల్ నుంచి షాద్‌నగర్‌కు కారు బుక్ చేయించుకుని వెళ్లిపోయాడన్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జంజారాహిల్స్ శ్రీరామ్ నగర్‌కు చెందిన రాఘవ రెడ్డి అనే వ్యక్తిని సింగిడి రాజేష్ తుపాకీతో బెదిరించి బ్యాగ్​ను లాక్కొని వెళ్లాడు. తన వద్ద నుంచి రూ.65 వేల నగదుతో పాటు, పని సామగ్రిని సైతం తీసుకుపోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవే కాదు.. జనవరి 10న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. ఎమ్​ఆర్​ఆర్​ బార్‌ను నిర్వహిస్తున్న వెంకట్ రెడ్డి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న సయమంలో.. కొందరు దుండుగులు అతనిపై దాడి చేసి నగదు దోచుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలిసులు దుండగులను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సైబరాబాద్‌ కమిషనరెట్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న వివిధ బ్యాంకులను, నగల దుకాణాలను దోచుకునేందుకు నగరానికి వచ్చిన ముఠాను పోలిసులు అరెస్ట్ చేశారు. నగర శివారు ప్రాంతాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో గస్తీని పటిష్ఠం చేయాలని.. సీసీటీవీ ద్వారా కూడా నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details