తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్ఎంసీ బరిలో 1121 మంది అభ్యర్థులు - ఈటీవీ భారత్​ వార్తలు

ఆదివారం రాత్రి వరకు అంకెలతో కుస్తీ పట్టిన జీహెచ్​ఎంసీ అధికారులు ఎట్టకేలకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యను వెల్లడించారు. గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో 1121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ప్రకటించారు.

contest in ghmc elections candidates final list released
జీహెచ్ఎంసీ బరిలో 1121 మంది అభ్యర్థులు

By

Published : Nov 23, 2020, 4:16 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అథారిటీ లోకేశ్​ కుమార్‌ ప్రకటించారు. గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలోని 150 వార్డులకు గాను 1121 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు.

ఆదివారం ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అత్యధికంగా చాంద్రాయణగుట్ట డివిజన్ జంగంమెట్‌లో 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యల్పంగా ఉప్పల్, నవాబ్​సేన్​కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నారు.

ఇదీ చదవండి:గ్రేటర్​ ఎన్నికల దృష్ట్యా జోరుగా మద్యం విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details