సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా కేసులు బయటపడిన ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలైన చిలకలగూడ, మారేడుపల్లి, కార్ఖానా, బోయినపల్లి, వాసవినగర్, అల్వాల్ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా పరిగణిస్తూ ప్రకటన చేశారు.
సికింద్రాబాద్ పరిసరాల్లో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు
సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా నిర్ధరణ అయిన బాధితుల ఇళ్ల సమీపంలో అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాపించకుండా స్థానికులెవరూ బయటకు రావద్దని ప్రచారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రసాయనాల పిచికారీ చేస్తున్నారు.
సికింద్రాబాద్ పరిసరాల్లో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు
బారికేడ్లు ఏర్పాటు చేసి.. రసాయన ద్రావణాలతో పిచికారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలనీ వాసులు స్వచ్ఛందంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో స్థానికులే.. అధికారులను తమ ప్రాంతాలను కంటైన్మెంట్గా ప్రకటించాలని కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించి కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా