రహదారిపై అడ్డగోలుగా ఆటంకాలు
లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకు పరిమితమైతే.. మరికొందరు ఇంటి ముందున్న రోడ్లను తవ్వడం పనిగా పెట్టుకున్నారు. తమ ఇంటి ముందు నుంచి ఎవరూ తిరగొద్దన్న ఉద్దేశంతో అడ్డుగోడను తలపించేలా వేగ నియంత్రికలు నిర్మిస్తున్నారు. వాటిపై ప్రయాణిస్తే నడుం విరగడం ఖాయం అన్నట్లు ఈ నిర్మాణాలు ఉన్నాయి.
Hyderabad roads latest news
లాక్డౌన్ వేళ భాగ్యనగరంలో అంతర్గత రోడ్లపై పలువురు స్థానికులు స్పీడు బ్రేకర్లు నిర్మిస్తున్నారు. ఎల్‌బీనగర్‌లో చంద్రపురి కాలనీకి వెళ్లే రహదారిలో ఒక కిలోమీటరు పరిధిలో ఏకంగా 7 చోట్ల రోడ్డు తవ్వారు. ఇలా నగరంలో పలు వీధులు సమీప ఇళ్లవారు అనధికారికంగా తవ్వేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా వేగ నిరోధకాలు ఏర్పాటు చేయడం, రహదారిని తవ్వడం చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వివరిస్తున్నారు.